స్టార్ మాలో రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్‌లో సామ్రాట్ రోల్ కొన్ని రోజుల నుంచి కనిపించడం లేదు. ఎందుకంటే సామ్రాట్ క్యారక్టర్ కేవలం తులసికి భజన చేయడం..ఇద్దరి మధ్య రొమాన్స్, పెళ్లి ఇలాంటి విషయాలు మాత్రమే చూపిస్తూండేసరికి ఆడియన్స్ కి అవి ఎక్కడం లేదు...వాళ్లకు పెద్దగా నచ్చలేదు...దాంతో ఈ సీరియల్ రేటింగ్ చాలా డౌన్ అవుతూ వచ్చింది.
ఇక ఇప్పుడు తన పాత్ర గురించిన ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో వస్తూ ఉండడంతో ఆయన ఇంద్రనీల్ ఒక ఇంటర్వ్యూలో స్పందించారు. ఆడియన్స్ కి నచ్చేలా తన రోల్ విషయంలో మార్పులు చేర్పులు జరుగుతున్న కారణంగా షూటింగ్ కి కొంచెం గ్యాప్ ఇచ్చినట్లు చెప్పారు. త్వరలోనే సీరియల్ లోకి మళ్ళీ రీ-ఎంట్రీ ఇస్తానని చెప్పారు. నెక్స్ట్ వీక్ షూటింగ్ షెడ్యూల్ ఉందని ఆ తర్వాత ఆడియన్స్ ముందుకు వస్తున్నట్లు చెప్పారు. ప్రేక్షకులు కథకు మరింత కనెక్ట్ అయ్యేలా స్టోరీలో చాలా చేంజెస్ చేశారని చెప్పుకొచ్చాడు ఇంద్రనీల్ అలియాస్ సామ్రాట్. ఈ సీరియల్ బెంగాలీ వెర్షన్ "శ్రీమోయి"లో హిందీ వెర్షన్ "అనుపమ" లో తులసి క్యారెక్టర్ కి రెండో సారి పెళ్లవుతుంది. కానీ ఇది తెలుగు వెర్షన్. ఇక్కడ ఆడియన్స్ కోరుకున్నప్పుడే ప్రేమ, పెళ్లి జరుగుతుంది. వాళ్లకు క్యారెక్టర్స్ నచ్చాలి లేదంటే ఎంతటి సీరియల్ ని ఐనా వదిలేస్తారు.
ఐతే ఈ ముదురు జంట ప్రేమ కథను ఆడియన్స్ జీర్ణించుకోలేకపోయారు. "ఇదేం చెత్త సీరియల్..చికాకుగా ఉంది. వాళ్ళు ఆడియన్సు కి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారో వాళ్ళకే తెలియడం లేదు. పెట్టిన టైటిల్ ఏమిటి చూపిస్తున్నది ఏమిటి" అని అంటున్నారు ప్రేక్షకులు. రివ్యూస్ అన్నీ చదివారేమో మేకర్స్ వెంటనే కత్తెర వేసే పనిలో పడ్డారు. మరి తెలుగు ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారో ఇప్పటికైనా అర్థమైనట్టు ఉంది అందుకే కథలో మార్పులు చేర్పులు చేస్తున్నట్టుగా ఉన్నారు. మరి ఈసారి సామ్రాట్ క్యారెక్టర్ ని ఎలా డిసైడ్ చేస్తారో, తులసిని ఎలా మౌల్డ్ చేస్తారో చూడాలి.